Rohit Sharma; టెస్టులకు రిటైర్మెంట్పై రోహిత్ కీలక నిర్ణయం 3 d ago
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోకూడా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్ తో మాట్లాడారట. కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్‌ను ఒప్పించే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించకపోతే, సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్ కు కెరీర్లో చివరి టెస్టు అవుతుంది.